ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రేపు ఆదివారం 13.09.2009 సాయంత్రం 6.00 గంటలకు ఇఫ్తార్ విందును ఆంధ్రా అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసారు. ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును సంప్రదాయ బద్ధంగా ఏర్పాటు చేయటం జరుగుతూ వస్తోందని, ఢిల్లీలోని తెలుగు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై రోజా (ఫాస్టింగ్) విరమించి అల్పాహారం సేవించి నమాజ్ ప్రార్థనలు చేస్తారని ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు, కన్వీనర్ సిలార్ ఖాన్ తెలియజేశారు. ఢిల్లీలోని తెలుగు ముస్లిం సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమానికి మైనారిటీ కమిషన్ చైర్మన్ డా. కమాల్ ఫరూఖీ, జామియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా. మహ్మద్ అనుష్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.