సీతారాముల కళ్యాణం చూతము రారండి!

శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విరోధి నామ సంవత్సర చైత్ర శుధ్ధ నవమి అనగా ది. 03-04-2009, శుక్రవారం ఉదయం 9.00 గంటలకు దశరధ తనయుడు, జగదభిరాముడు శ్రీ రామ చంద్రునకు, జనకపుత్రి, మహాసాధ్వి జానకీదేవినిచ్చి కళ్యాణ మహోత్సవమును నిర్వహించుటకు ఆంధ్రా అసోసియేషన్ నిశ్చయించినది. కాన తామెల్లరూ బంధు మిత్ర సపరివార సమేతంగా విచ్చేసి కళ్యాణ రాముని కృపకు పాత్రులు కండి. మా ఆతిథ్యమును స్వీకరించి మమ్ములను ఆనందింప చేయండి.

-: కళ్యాణ వేదికలు :-

1.దక్షిణ ఢిల్లీ:

ఆంధ్రా అసోసియేషన్ బిల్డింగ్ ఆడిటోరియం, సాయిబాబా మందిరం ప్రక్కన, లోఢీ రోడ్, న్యూఢిల్లీ.

2.సెంట్రల్ ఢిల్లీ:

18-42 బ్లాక్, సెంట్రల్ పార్క్, సెక్టర్-2, పేష్వా రోడ్, గోల్ మార్కెట్, న్యూఢిల్లీ.

3.ఆర్.కే. పురం:

జ్వాలాముఖి దుర్గా మందిరం, సెక్టర్-6, ఆర్.కే.పురం, గురుద్వారా ప్రక్కన, P&T కమ్యునిటీ హాల్ వెనుక, కొత్త ఢిల్లీ.

4.తూర్పు ఢిల్లీ:

(i) శ్రీ శ్రీ శ్రీ శివ మందిర్, గోవింద్ ఖండ్ (గురుద్వార ప్రక్కన), విశ్వకర్మ నగర్, ఢిల్లీ-110095.

(ii) శ్రీ వెంకటేశ్వర మందిరం, కాకతీయ ఆపార్ట్ మెంట్స్, పట్ పట్ గంజ్, ఢిల్లీ.

5.ఉత్తర ఢిల్లీ:

A. ఐశ్వర్య గణపతి మందిరం, C-2 బ్లాక్, లారెన్స్ రోడ్ (కేశవపురం).

B. మనోరంజన్ హాల్, ఢిల్లీ అడ్మినిస్ట్రేశన్ ప్లాట్స్, తిమ్మార్‌పూర్, ఢిల్లీ.

6.పశ్చిమ ఢిల్లీ: మహారాజ అగ్రసేన్ భవన్, ఎమ్.సి.డి.హాల్, C-2B, జనక్ పురి, కొత్త ఢిల్లీ.

విరోధి నామ సంవత్సర ఉగాది సంబరాలు - సాంస్కృతిక కార్యక్రమాలు - ఉపకార వేతనముల వితరణ

ఢిల్లీ మరియు పరిసర ప్రాంతములలో నివసిస్తున్న తెలుగు వారందరికీ విరోధినామ సంవత్సర ఉగాది హార్ధిక శుభాకాంక్షలు. ఉగాది పర్వదిన సందర్భంగా ఈ నెల 29వ తేదీ ఆదివారంనాడు ఆంధ్రాఅసోసియేషన్ ఉగాది వేడుకలు జరుప నిశ్చయించి అసోసియేషన్ భవనంలోని ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా, చిన్నారులచే కూచిపూడి నృత్య ప్రదర్శన మరియు కర్ణాటక సంగీత గాత్ర కఛ్చేరి ఏర్పాటు చేసినది.
ఈ కార్యక్రమాలలో భాగంగా ఢిల్లీలోని పేద మరియు ప్రతిభ గల తెలుగు విద్యార్ధులకు ఉపకార వేతనములను కూడా అందించనుంది. ధరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అసోసియేషన్ కార్యాలయంలో సంప్రదించి అర్హత పొందినవారు ఈ నెల 29వ తేదీన జరుగు కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని ఉపకార వేతనములు అందుకొనవలసినదిగా అసోసియేషన్ కార్యవర్గం కోరుతున్నది. విద్యార్ధులు పాఠశాల గుర్తింపు పత్రాలను (School Identity card) తప్పనిసరిగా తీసుకురావలెను.

విరోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉగాది పర్వదిన సందర్భంగా ఆంధ్రాఅసోసియేషన్ ఉగాది సంబరాలు జరుప నిశ్చయించి అసోసియేషన్ భవనంలోని ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా, చిన్నారులచే కూచిపూడి నృత్య ప్రదర్శన మరియు కర్ణాటక సంగీత గాత్ర కఛ్చేరి ఏర్పాటు చేసినది. ఈ సందర్భంగా ఢిల్లీలోని పేద మరియు ప్రతిభ గల తెలుగు విద్యార్ధులకు ఉపకార వేతనములు అందించనుంది. ధరఖాస్తు చేసుకున్న విద్యార్ధులందరు 29న జరుగు కార్యక్రమంలో పాల్గొని ఉపకార వేతనములు అందుకొనవలసినదిగా అసోసియేషన్ కార్యవర్గం కోరుతున్నది.